Harish Rao : రైతుబంధు నిధులను వెంటనే విడుదల చేయాలి : హరీష్ రావు

తెలంగాణ మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు .

Update: 2024-08-10 14:46 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు .శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపీణీ కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. 'ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు ఆ హామీలను గాలికొదిలేసిందని తెలిపారు. వానాకాలం సీజన్‌ ప్రారంభంమై 3 నెలలవుతున్నా ఈ ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు రైతుబంధు కింద ఆర్థికసాయం విడుదల చేయలేదని విమర్శించారు.  జులై, ఆగస్టు నెలల్లో 10 రోజులు గడిచినా ప్రభుత్వం లబ్ధిదారులకు పింఛన్లు ఇవ్వలేదన్నారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు సహాయాన్ని జూన్‌ నెలలోనే విడుదల చేసేదని, రైతు భరోసా కోసం ఎకరానికి రూ.7,500 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటి వరకు రూ.5వేలు కూడా ఇవ్వలేకపోయారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద పెళ్లికూతురికి తులాల బంగారం ఇస్తామన్న ఈ ప్రభుత్వం గత ఎనిమిది నెలలుగా కల్యాణలక్ష్మి పథకానికి నిధులు విడుదల చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు . తప్పుడు వాగ్దానాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, పింఛన్‌ను రూ.4 వేలకు పెంచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం వేతనాలు విడుదల చేయకపోవడంతో గ్రామాల్లో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని ,ఇళ్ల నుంచి చెత్తను సేకరించేందుకు కూడా పంచాయతీల దగ్గర నిధులు లేవని వెల్లడించారు. 


Similar News