Harish Rao: రేవంత్‌వి చిట్‌చాట్‌లు కాదు.. ‘చీట్‌చాట్‌’లు: మాజీ మంత్రి హరీష్‌రావు ఫైర్

రాష్ట్రంలో రైతు రుణమాఫీపై అధికార, విపక్ష నాయకుల మధ్య నెలకొన్న వివాదం ఇంకా చల్లబడలేదు.

Update: 2024-08-29 10:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రైతు రుణమాఫీపై అధికార, విపక్ష నాయకుల మధ్య నెలకొన్న వివాదం ఇంకా చల్లబడలేదు. రుణమాఫీపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన సవాలును ఉద్దేశించి ఇటీవలే కాంగ్రెస్ నాయకులు సిద్దిపేటలో ఆయన వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన క్యాంపు ఆఫీసుపై కూడా దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ వర్సెస్ హరీష్‌రావు అన్న చందంగా మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా, సీఎం రేవంత్ ‌రెడ్డిపై హరీశ్‌రావు మరోసారి ఫైర్ అయ్యారు. రేవంత్‌వి చిట్‌చాట్‌లు కాదు.. ‘చీట్‌చాట్’లు అంటూ ఎద్దేవా చేశారు. ఆయన రాష్ట్రంలో రైతులకు జరిగిన రుణమాఫీపై ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని హితువు పలికారు.

రేవంత్ స్వగ్రామం కొండారెడ్డిపల్లి లేదా సంగారెడ్డికి రాహుల్ గాంధీని తీసుకెళ్దామని.. అక్కడ రైతులకు రుణమాఫీ అయిందో లేదో అడుగుదామని సవాలు విసిరారు. రేవంత్ రెడ్డి రైతులనే కాదు.. రాహుల్ గాంధీని కూడా మోసం చేశారని ఫైర్ అయ్యారు. అందుకే రుణమాఫీ సభకు రావాలని సీఎం మూడు సార్లు ఆహ్వానించినా ఆయన రాలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పూర్తిగా రుణమాఫీ కాలేదంటూ మంత్రులే రోజూ చెబుతున్నారని గుర్తు చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి లెక్కల ప్రకారం.. ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదని అన్నారు. ఆగస్టు 15‌లోగా రైతులందరికీ రుణమాఫీ చేయాలన్నది తన సవాల్ అని.. అది చేశారని అని హరీశ్‌రావు ప్రశ్నించారు.   

అదేవిధంగా ఫోర్త్ సిటీ పేరుతో కూడా భారీ కుట్ర జరుగుతోందిని అన్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు బయటపెడతానని తెలిపారు. కందుకూరులోని సర్వే నెం.9లో 385 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పనంగా కొట్టేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తుక్కుగూడలో 28 ఎకరాలపై అగ్రిమెంట్లు కూడా జరుగుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ పెద్దల తమ్ముళ్లు, పీఏ పేరిట అగ్రమెంట్ల తతంగాన్ని త్వరలోనే బయటపెడతానని హరీశ్ తెలిపారు.


Similar News