Lagcherla : లగచర్ల గ్రామస్థుల అరెస్టుపై స్పందించిన మాజీ మంత్రి హరీశ్ రావు
ఫార్మా కంపెనీల కోసం భూముల సేకరణపై లగచర్లలో ప్రభుత్వం సోమవారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ రణరంగంగా మారిన విషయం తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: ఫార్మా కంపెనీల కోసం భూముల సేకరణపై (Vikarabad) వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం (Lagcherla Village) లగచర్లలో ప్రభుత్వం సోమవారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ రణరంగంగా మారిన విషయం తెలిసిందే. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై జరిగిన దాడి ఘటనలో దాదాపు 30 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రభుత్వ తీరు అమానుషం.. లగచర్ల గ్రామానికి 300 మంది పోలీసులు చేరుకుని గ్రామస్థులను అరెస్టు చేయడం దారుణమన్నారు. ఫార్మా భూసేకరణకు నిరాకరించిన వాళ్ళను పోలీసులతో బెదిరించాలని చూడడం దారుణమైన విషయమన్నారు.
అర్ధరాత్రి పోలీసులతో ప్రభుత్వం దమనకాండ నిర్వహించడం సరికాదని ఆరోపించారు. ప్రభుత్వం తీరును ఖండిస్తున్నామని, ప్రజాభిప్రాయాన్ని తీసుకోకుండా భూసేకరణ చేపట్టడం వెనుక ఉన్న రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉద్దేశం తెలియాలని విమర్శించారు. సీఎం వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేపడుతున్న భూసేకరణను తక్షణం నిలిపివేయాలని ఆరోపించారు. పోలిసుల అదుపులో ఉన్న గ్రామస్థులను, రైతులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Read More: Harish Rao: పార్టీ నడుపుతున్నారా? రౌడీ ముఠానా.. హరీశ్ రావుకు టీ కాంగ్రెస్ కౌంటర్