Harish Rao: మూసీ సుందరీకరణ ఓకే.. మరి మంజీరా ఏం చేస్తున్నారు: హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు

ప్రభుత్వం చేపడుతోన్న మూసీ సుందరీకరణ (Mouse beautification) ఓకే.. కానీ, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఫార్మా సిటీ (Pharma City) ఏర్పాటుతో మంజీరా (Manjeera)ను ఏం చేయబోతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.

Update: 2024-10-03 07:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం చేపడుతోన్న మూసీ సుందరీకరణ (Mouse beautification) ఓకే.. కానీ, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఫార్మా సిటీ (Pharma City) ఏర్పాటుతో మంజీరా (Manjeera)ను ఏం చేయబోతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇవాళ ఆయన ఫార్మాసిటీ ఏర్పాటుతో కోల్పోతున్న పంట పొలాలను పరిశీలించారు. అదేవిధంగా అక్కడున్న రైతులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జహీరాబాద్‌ (Zaheerabad)లో ఫార్మా సిటీ (Pharma City) ఏర్పాటుతో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయని ఆరోపించారు. ఫార్మా సిటీ నుంచి వచ్చే వ్యర్థ జలాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న నక్కవాగు, చాకలి వాగు, కోట వాగు, న్యాల్‌కల్ వాగుల్లో కలుస్తాయని తెలిపారు. అక్కడి నుంచి ఆ నీరంతా వెళ్లి చెనగపల్లి ప్రాజెక్టులోకి వెళ్తాయని, అక్కడి నుంచి పెద్ద వాగు ద్వారా మంజీరాలో పడతాయని పేర్కొన్నారు. దీంతో పాలలాంటి మంజీరా కాలుష్య కాసారంగా మారుతుందని హరీశ్ ఆవేదన వక్తం చేశారు.

మంజీరా జలాలను మెదక్, హైదరాబాద్ జిల్లాల ప్రజలు తాగుతున్నారని.. ఇప్పుడు ఆ జలాలు కూడా విషంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఫార్మా సిటీ (Pharma City) భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. భూ నిర్వాసితులు ఎవరూ అధైర్యపడొద్దని, ఎలాంటి అఘాయిత్యాలు చేసుకోవద్దని సూచించారు. నిరుపేదల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడి కొట్టాడుతుందని హామీ ఇచ్చారు. ఫార్మా సిటీని అడ్డుకునేందుకు హైకోర్టుకు వెళ్తామని అన్నారు. అవసరం అయితే దేశ రాజధాని ఢిల్లీలోని గ్రీన్ ట్రిబ్యూనల్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు.  


Similar News