Harish Rao: గ్రూప్-1 అభ్యర్థుల ఆర్తనాదాలు కాంగ్రెసోళ్లకు వినిపించట్లేదా: హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు చేస్తున్న ఆర్తనాదాలు కాంగ్రెసోళ్లకు వినిపించడం లేదా అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఘాటుగా వ్యాఖ్యానించారు.

Update: 2024-10-19 07:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు చేస్తున్న ఆర్తనాదాలు కాంగ్రెసోళ్లకు వినిపించడం లేదా అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన సిద్ధిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్-1 పరీక్ష విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన మండిపడ్డారు. జీవో నెం.29తో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. అందరికీ న్యాయం చేయాలనే ఆనాడు కేసీఆర్ తెచ్చిన జీవో నెం.55ను ఎందుకు రద్దు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. నిరసన తెలిపే కనీస హక్కు కూడా నిరుద్యోగులకు లేదా అని ఫైర్ అయ్యారు.

ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు ఎక్కడకు పోయారని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ పత్తా లేకుండా పోయిందని అన్నారు. గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లను సర్కార్ ఎందుకు పట్టింకోదని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆందోళనలపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వెంటనే స్పందించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.   


Similar News