నీట్ ఎగ్జామ్ లీకేజీలో బీజేపీ నేతల హస్తం: చనగాని దయాకర్

నీట్ ఎగ్జామ్ లీక్‌పై బీజేపీ ఎందుకు మౌనం వహిస్తుంది..? అంటూ టీపీసీసీ స్పోక్స్ పర్సన్ చనగాని దయాకర్ ప్రశ్నించారు.

Update: 2024-06-10 17:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: నీట్ ఎగ్జామ్ లీక్‌పై బీజేపీ ఎందుకు మౌనం వహిస్తుంది..? అంటూ టీపీసీసీ స్పోక్స్ పర్సన్ చనగాని దయాకర్ ప్రశ్నించారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నీట్ ఎగ్జామ్‌ను రద్దు చేసి మళ్లీ రీ ఎగ్జామ్ నిర్వహించాలన్నారు. నీట్ ఎగ్జామ్ లీకేజీలో బీజేపీ నేతల హస్తం ఉన్నదన్నారు. తెలుగు విద్యార్ధులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. గుజరాత్ కు చెందిన పర్శ రామ్ రాయ్, తుషార్ లు కలసి 16 మంది దగ్గర రూ.10 లక్షలు తీసుకుని ఎగ్జామ్ రాయించారన్నారు. ఛత్తీస్ ఘడ్, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర లాంటి స్టేట్స్‌లో గ్రేస్ మార్క్స్ ఇచ్చి, తెలుగు రాష్ట్రాల విద్యార్ధులకు తీరని అన్యాయం చేశారన్నారు. ఇక ఆసిఫాబాద్, కాగజ్ నగర్‌లో విద్యార్ధులకు సెట్ మార్చి ఇచ్చారన్నారు. ఒకే సెంటర్‌లో 8 మంది విద్యార్ధులకు ఒకే రకంగా మార్కులు రావడం పలు అనుమానాలకు దారి తీసిందన్నారు. ఒక ప్లాన్ ప్రకారం గానే అప్లై చేసేటప్పుడు పైసలు తీసుకొని ఒకే తరగతి గదిలోకి వచ్చేలా చేశారన్నారు. నీట్‌పై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకొకపోతే విద్యార్ధులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాడుతుందన్నారు.


Similar News