తెలంగాణలో ఒంటి పూట బడులు స్టార్ట్.. ఎప్పటి నుంచి అంటే?
తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇప్పటికే ఎండలు మొదలయ్యాయి. దీంతో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇప్పటికే ఎండలు మొదలయ్యాయి. దీంతో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్చి 15 నుంచి తెలంగాణలోని అన్ని పాఠశాలలకు ఒంటిపూట తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే విద్యా సంస్థలు నడపాలని తెలిపింది. ఇక ఏప్రిల్ 25 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.ఒకటి నుంచి ఐదవ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 12 నుంచి 17 వరకు, 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 20 వరకు పరీక్షల నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 21 ఫలితాలు వెల్లడి, ఏప్రిల్ 24న అన్ని స్కూళ్లలో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి 25 నుంచి సెలవులు ఇవ్వనున్నట్లు సమాచారం.