లగ్జరీ అపార్ట్‌మెంట్ వాసులకు సైతం గృహ జ్యోతి! జీరో కరెంట్ బిల్ స్లిప్ వైరల్

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగమైనా ‘గృహజ్యోతి’ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

Update: 2024-03-09 10:03 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగమైనా ‘గృహజ్యోతి’ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ సదుపాయం ప్రభుత్వం కల్పించింది. ఇందులో భాగంగా రేషన్ కార్డు ఉన్నవారికి, అర్హులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. అయితే పెద్దపెద్ద అపార్ట్‌మెంట్లో ఉన్నావారికి సైతం 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

పుప్పాలగూడ లోని గ్రీన్ స్పేస్ హౌసింగ్ సొసైటీలోని లగ్జరీ అపార్ట్మెంట్ వాసులకు సైతం జీరో కరెంట్ బిల్లులు జారీ అయ్యాయి. దీనికి సంబంధించిన కరెంట్ బిల్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అర్హులకు మాత్రమే ఇస్తానన్న ఫ్రీ కరెంట్ పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్‌లల్లో ఉండే వారు కూడా ఆర్హులేనా? అని నెటిజన్లు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.

Tags:    

Similar News