ముగిసిన గ్రూప్‌-1 మెయిన్స్.. చిట్టీలతో పట్టుబడిన అభ్యర్థులు

ఎన్నో అవాంతరాలు, ఇబ్బందులు, కోర్టు కేసులను అధిగమించి నిర్వహించిన గ్రూప్ 1(Group-1) మెయిన్స్ పరీక్షలు(Exams) ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఈనెల 21వ తేదీన మొదలైన పరీక్షలు ఆదివారంతో కంప్లీట్ అయ్యాయి.

Update: 2024-10-27 17:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఎన్నో అవాంతరాలు, ఇబ్బందులు, కోర్టు కేసులను అధిగమించి నిర్వహించిన గ్రూప్ 1(Group-1) మెయిన్స్ పరీక్షలు(Exams) ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఈనెల 21వ తేదీన మొదలైన పరీక్షలు ఆదివారంతో కంప్లీట్ అయ్యాయి. తెలంగాణలో మొత్తం 513 పోస్టులకు గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ విడుదలైంది. కాగా మొత్తం 31,383 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. కాగా మరో 20 మంది స్పోర్ట్స్ క్యాండిడేట్లు పరీక్ష రాసేందుకు ప్రత్యేకంగా కోర్టు నుంచి అనుమతి పొందారు. ఇదిలా ఉండగా చివరి రోజు పరీక్షకు 21,151 మంది హాజరయ్యారు. ఇది 67.3 శాతంగా నమోదైంది. కాగా ఇప్పటికే మూడు సార్లు గ్రూప్-1 (Group-1) రద్దయింది. ఈ తరుణంలో శుక్ర, శనివారాల్లో చిట్టీలు తీసుకెళ్లి పలువురు అభ్యర్థులు పట్టపడటం ఆందోళనకు కారణమైంది. ఈ ఘటనతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రం ఎలాంటి మాస్ కాపీయింగ్ జరగలేదని, అభ్యర్థులను పరీక్షకు ముందుగానే గుర్తించి రాసేందుకు కూడా అనుమతించలేదని స్పష్టంచేశారు. ప్రశ్నపత్రానికి, పలువురు అభ్యర్థుల వద్ద లభ్యమైన చిట్టీల్లో ఉన్న జవాబులకు ఏమాత్రం ఎలాంటి పొంతన లేదని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


Similar News