Group-1 Exams: గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షలో సంచలనం.. మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడిన అభ్యర్థిని

రాష్ట్రంలో టీఎస్‌పీఎస్సీ (TGPSC) గ్రూప్‌-1 మెయిన్స్ (Group-1 Mains) పరీక్షలు చెదరుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగానే కొనసాగుతున్నాయి.

Update: 2024-10-25 12:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో టీజీపీఎస్సీ (TGPSC) గ్రూప్‌-1 మెయిన్స్ (Group-1 Mains) పరీక్షలు చెదరుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగానే కొనసాగుతున్నాయి. పరీక్షను అత్యంత పడక్బందీగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యం అయినా.. అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోని అనుతించడం లేదు. ఈ క్రమంలోనే టీజీపీఎస్పీ (TGPSC) గ్రూప్-1 మెయిన్స్ (Group-1 Mains) పరీక్షల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం (Ibraheempatnam)లోని సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాల (CVR Engineering College)లో మహబూబ్‌నగర్ జిల్లా (Mahbubnagar District)కు చెందిన అభ్యర్థిని లక్ష్మి పరీక్షకు హాజరైంది. అయితే, పరీక్ష మధ్యలో లక్ష్మి మాస్ కాపీయింగ్‌ (Mass Copying)కు పాల్పడుతుండగా ఇన్విజిలేటర్ (Invigilator) గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందజేశారు. దీంతో అభ్యర్థి ఆన్సర్ షీట్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.    


Similar News