గ్రూప్ 1 అభ్యర్థులకు హైకోర్టులో షాక్..

సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసి.. గ్రూప్-1 పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

Update: 2024-10-18 11:36 GMT

దిశ, వెబ్ డెస్క్: సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసి.. గ్రూప్-1 పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు గ్రూప్-1 అభ్యర్థులకు షాక్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సమర్ధించింది. అలాగే అప్పీల్ పిటిషన్‌ను డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఈ నెల 21 న యథావిధిగా మెయిన్స్ నిర్వహించవచ్చని హైకోర్టు తెలిపింది.

ఈ సందర్భంగా హైకోర్టు హైకోర్టు డివిజన్‌ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. చివరి నిమిషంలో పరీక్ష రద్దు సాధ్యం కాదని, కేవలం 8 మంది పిటిషనర్ల కోసం లక్షల మంది ఎందుకు ఇబ్బందిపడాలని ప్రశ్నించింది. ఇప్పటికే రెండు సార్లు పరీక్ష రద్దు అయ్యిందని, పరీక్షల కోసం ఎంతో మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని, ఈ సమయంలో పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.

తెలంగాణలో గ్రూప్‌-1కు సర్వం సిద్ధం

ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్-1 పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నాయి. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 46 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్-1 పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని పరీక్షా కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.


Similar News