Bandi Sanjay: గ్రూప్-1 అభ్యర్థులకు బీజేపీ మద్దతు.. అశోక్ నగర్‌కు కేంద్రమంత్రి!

గ్రూప్-1 అభ్యర్థులకు బీజేపీ మద్దతు తెలుపుతుందని, మెయిన్స్ పరీక్షలు రీషెడ్యూల్ చేసేవరకు పోరాటం చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.

Update: 2024-10-18 13:24 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రూప్-1 అభ్యర్థులకు బీజేపీ మద్దతు తెలుపుతుందని, మెయిన్స్ పరీక్షలు రీషెడ్యూల్ చేసేవరకు పోరాటం చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్‌లో గ్రూప్-1 అభ్యర్థులు కేంద్రమంత్రి బండి సంజయ్ ను కలిశారు. ఈ సందర్భంగా మరో రెండు రోజుల్లో జరగబోయే గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయాలని, 29 జీవోను తొలగించి, తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ విషయాన్ని బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఈ సందర్భంగా.. రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకమని తెలంగాణలో రుజువైందని ఆరోపించారు.

కరీంనగర్‌లో మెయిన్స్ పరీక్షను వాయిదా వేయడంపై సహాయం కోరుతున్న కన్నీళ్లతో కూడిన గ్రూప్1 అభ్యర్థులను కలిశానని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం ఏ విధంగా దెబ్బతీస్తుందో చెప్పడానికి జీఓ29 యే నిదర్శనమన్నారు. గ్రూప్1 జాబ్ అభ్యర్థులకు బీజేపీ మద్దతు ఇస్తుందని, అంతేగాక గ్రూప్1 మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేసే వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు. యువతపై లాఠీచార్జిని తీవ్రంగా ఖండించిన ఆయన.. యువత రక్తం చూసిన ప్రభుత్వం ఎప్పటికీ నిలదొక్కుకోదని, ఇది తప్పు అని మండిపడ్డారు. అలాగే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు తాను అశోక్‌నగర్‌కు వెళ్లి ఆశావహులను కలుస్తానని అభ్యర్థులకు కేంద్రమంత్రి భరోసా ఇచ్చారు. 


Similar News