Milad-Un-Nabi 2024 : ప్రజాపాలనలో ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి ప్రాధాన్యం : సీఎం రేవంత్ సందేశం

ఇస్లామియా కాలమాన పట్టిక ప్రకారం మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లింలు మిలాద్-ఉన్-నబీ పండుగ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొంటారు.

Update: 2024-09-16 07:58 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఇస్లామియా కాలమాన పట్టిక ప్రకారం మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లింలు మిలాద్-ఉన్-నబీ పండుగ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొంటారు. ఈ నెల ప్రారంభం నుంచి 12 రోజుల పాటు ప్రవక్త జీవిత విశేషాలు తెలియజేస్తూ మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. కాగా, మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఆయన తెలంగాణ సీఎంవో కార్యాలయం ద్వారా ఓ సందేశం విడుదల చేశారు. ప్రపంచానికి శాంతి, కరుణ, ఐక్యత సందేశం ఇచ్చిన ముహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం అత్యంత పవిత్రమైన రోజని అన్నారు. ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి ప్రజా పాలనలో సముచిత ప్రాధాన్యం ఉంటుందని తన సందేశంలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు.


Similar News