దేవాలయాల జీర్ణోద్ధరణ పనులకు నిధులు మంజూరు : మంత్రి హరీష్ రావు

సిద్దిపేట నియోజక వర్గ పరిధిలోని ఆరు పురాతన దేవాలయాల జీర్ణోద్ధరణ పనులకు కోటీ 98 లక్షల 50 వేల రూపాయలు మంజూరైనట్లు రాష్ట్ర మంత్రి హరీష్ రావు వెల్లడించారు.

Update: 2023-08-25 11:03 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేట నియోజక వర్గ పరిధిలోని ఆరు పురాతన దేవాలయాల జీర్ణోద్ధరణ పనులకు కోటీ 98 లక్షల 50 వేల రూపాయలు మంజూరైనట్లు రాష్ట్ర మంత్రి హరీష్ రావు వెల్లడించారు. చిన్నకోడూర్ మండలం సలేంద్రి గ్రామంలోని ప్రాచీన శివాలయానికి రూ.50 లక్షలు, విఠలాపూర్ గ్రామంలో గుట్ట పై వెలిసిన శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయానికి రూ.42 లక్షలు, నారాయణ రావు పేట మండలంలోని పురాతన ఆలయం శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి ఆలయానికి రూ. 39 లక్షలు, సిద్దిపేట పట్టణంలోని శ్రీ పెద్దమ్మ దేవాలయం అభివృద్ధి కి రూ.30 లక్షలు, హనుమంతు పల్లి ఇరుకోడ్ లోని పెద్దమ్మ ఆలయం మిగులు పనులకు రూ.20 లక్షలు, సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలోని శ్రీ మహంకాళి దేవాలయం రూ.17.50 లక్షలు మంజూరు అయ్యామని మంత్రి హరీష్ రావు తెలిపారు. త్వరలోనే టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని నియోజకవర్గం లో ఇప్పటికే 50కి పైగా ఆలయాలు అభివృద్ధి చేసినట్లు ఆయన చెప్పారు.

Tags:    

Similar News