తెలంగాణల పుట్టి.. పూల పల్లకి ఎక్కి (వీడియో)

రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా ముగిశాయి. రాష్ట్రంలోని మారుమూల గ్రామాలతో పాటు నగరాల్లోనూ అట్టహాసంగా జరుపుకున్నారు.

Update: 2022-10-04 05:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా ముగిశాయి. రాష్ట్రంలోని మారుమూల గ్రామాలతో పాటు నగరాల్లోనూ అట్టహాసంగా జరుపుకున్నారు. డీజే పాటల మోతలతో వీధులన్నీ మోత మోగిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని మునిపంపుల గ్రామంలోనూ సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళలే కాకుండా యువకులు కూడా ఆడిపాడి ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో బూడిద భిక్షం, గంటెపాక పెద్ద ముత్యాలు, మేడి భాషయ్య, కానుకుంట్ల ఉపేందర్, పోగుల ఉపేందర్, గంటెపాక శివ, గంటెపాక శ్రీధర్, శ్రీకృష్ణ, జిట్ట రాకేశ్, గంటెపాక సాయి, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

Tags:    

Similar News