తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Update: 2024-09-26 05:25 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.  గురువారం వేకువజామున తోమాల, అర్చన సేవల్లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పాల్గొని దేవ దేవుడిని దర్శించుకున్నారు. స్వామి దర్శనం అనంతరం గవర్నర్ కు ఆలయ పండితులు రంగనాయకుల మంటపంలో వేదాశీర్వచనం అందించారు. అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుండగా..6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టికెట్లులేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతున్నది. బుధవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.50 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది.


Similar News