Ration card:ప్రభుత్వం సంచలన నిర్ణయం.. భారీగా రేషన్ కార్డులు రద్దు

రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో చాలా మంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు.

Update: 2024-09-25 04:38 GMT

దిశ,వెబ్‌డెస్క్:రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో చాలా మంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో రేషన్ కార్డులో కొంత మంది పేర్లు తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని రేషన్ కార్డులు రద్దు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే.. బోగస్ రేషన్ కార్డులు ఏరివేయడానికి ప్రభుత్వం రేషన్ కార్డు ఈ-కేవైసీ చేసుకోవాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలో దాదాపు 15 లక్షల తెల్ల రేషన్ కార్డులు రద్దు కానున్నట్లు తెలుస్తోంది. E-KYC ప్రక్రియకు హాజరుకాకపోవడంతో వీరందరి కార్డులను ప్రభుత్వం రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇకపై రేషన్ కార్డుల జారీలో పకడ్బందీగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి నుంచి సిటిజన్ 360 డేటా సాయంతో అర్హులైన వారికే కార్డులు మంజూరు చేయనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి.


Similar News