టీచర్ల బదిలీలు టీఆర్టీ పై ప్రభుత్వ నిర్లక్ష్యం

టెట్ పరీక్ష నిర్వహించి సంవత్సరం గడుస్తున్న 15 వేల టీచర్ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వకుండా టీఆర్టీ నోటిఫికేషన్ పై కాలయాపన చేస్తున్నారని

Update: 2023-05-04 09:34 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: టెట్ పరీక్ష నిర్వహించి సంవత్సరం గడుస్తున్న 15 వేల టీచర్ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వకుండా టీఆర్టీ నోటిఫికేషన్ పై కాలయాపన చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించింది. ఈ మేరకు గురువారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక పక్క టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ తెరపైకి తీసుకువచ్చి ఆ ప్రక్రియ న్యాయ వివాదాల్లో చిక్కుకున్న పరిష్కరించడం లేదని, నిర్లక్ష్య వైఖరితో అటు బదిలీల పదోన్నతుల ప్రక్రియ పూర్తికాకుండా ఇటు టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయకుండా ఉండడం వల్ల లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర ఆవేదన లో ఉన్నారని తెలిపారు. విద్యాశాఖ ఆర్థిక శాఖ మంత్రులు వెంటనే చొరవ తీసుకుని టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ కి సంబంధం లేకుండా 15 వేల ఉపాధ్యాయ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి టీఆర్టీ నోటిఫికేషన్ జారీ అయ్యే విధంగా చేయాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News