ప్రభుత్వం నేత కార్మికులను ఆదుకోవాలి: స్టేట్ హ్యాండ్లూమ్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ గంజి మురళీధర్

చేనేత కార్మికులు, సహకార సంఘాల్లో పేరుకుపోయిన వస్త్రాల నిల్వలను ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసి ఆదుకోవాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ కోరారు.

Update: 2024-09-10 14:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: చేనేత కార్మికులు, సహకార సంఘాల్లో పేరుకుపోయిన వస్త్రాల నిల్వలను ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసి ఆదుకోవాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ కోరారు. హైదరాబాద్‌లోని దొడ్డి కొమరయ్య భవన్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎంకు చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమ పథకాల కొనసాగింపు థ్రిఫ్ట్ ఫండ్, చేనేత మిత్ర, నేతన్నా బీమాపై వివరించడంలో సంఘ నాయకులు విఫలమయ్యారని ఆరోపించారు.

చేనేత కార్మికులకు, నేతన్నలకు రుణ మాఫీకి రూ.30 కోట్లు, బకాయిలు రూ.280 కోట్లు విడుదలపై వారు హర్షం వ్యక్తం చేశారు. రుణమాఫీ సుమారు రూ.70 కోట్లు ఉంటుందని రూ.30 కోట్లు మాత్రమే ప్రకటించారని, మిగిలినవి సైతం విడుదల చేయాలన్నారు. సహకార సంఘాలు, వ్యక్తిగత రుణాలు పూర్తి రుణ మాఫీ చేయాలని కోరారు. మార్కెట్ లేక నేసిన వస్త్రాల నిలువలు గుట్టలుగా పేరుకుపోయాయని వాటిని ప్రభుత్వం కొనుగోలు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. థ్రిప్టు ఫండ్ పథకాన్ని, 40 శాతం యారన్ సబ్సిడీని కొనసాగించాలని కోరారు. పవర్ లూమ్ కార్మికుల గురించి సీఎం ఎలాంటి ప్రకటన చేయకపోవడం సరికాదన్నారు.

ప్రభుత్వం నేత కార్మికులను ఆదుకోవాలి: స్టేట్ హ్యాండ్లూమ్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ గంజి మురళీధర్పవర్ లూమ్ కార్మికులకు వర్కర్ టూ ఓనర్ పథకాన్ని వర్క్ షెడ్డు‌తో కలిపి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షల ఆర్థిక సహకారం ఇతర సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని కోరారు. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి చేనేత పవర్‌లూమ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలపై వివరిస్తామని అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కందగట్ల గణేష్, తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, జిల్లా కోశాధికారి గంజి నాగరాజు, చేనేత కార్మిక సంఘం నాయకులు కర్నాటి శ్రీరంగం, గడ్డం దశరథ, రాపోలు వెంకన్న, ఆలుగొండ మధు, తదితరులు పాల్గొన్నారు.


Similar News