మున్నూరు కాపు కార్పొరేషన్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

గత పదేళ్లుగా మున్నూరు కాపు కార్పొరేషన్ సాధనకై మున్నూరు కాపు సంఘాలు పోరాటం చేస్తున్నాయి.

Update: 2024-01-27 13:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గత పదేళ్లుగా మున్నూరు కాపు కార్పొరేషన్ సాధనకై మున్నూరు కాపు సంఘాలు పోరాటం చేస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఫైనాన్స్ కార్పొరేషన్ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని సంఘం నేతలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం మున్నూరు కాపు కార్పొరేషన్ పై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ సచివాలయంలోని చాంబర్‌లో వేములవాడ ఎమ్మేల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర మున్నూరు కాపు వివిధ సంఘాల నేతలతో బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మున్నూరు కాపు కార్పొరేషన్ కి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు. ఈ క్రమంలోనే కాపు సంఘాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News