మెడిసిన్​ కొరతపై సర్కార్​ సీరియస్​

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వాసుపత్రుల్లో మందులు కొరత వేధిస్తున్నట్లు మీడియా, సోషల్​ మీడియాల్లో మరోసారి వార్తలు రిపీట్​ అయితే అధికారులపై చర్యలు

Update: 2022-04-07 17:16 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వాసుపత్రుల్లో మందులు కొరత వేధిస్తున్నట్లు మీడియా, సోషల్​ మీడియాల్లో మరోసారి వార్తలు రిపీట్​ అయితే అధికారులపై చర్యలు ఉంటాయని మంత్రి హరీష్​ రావు హెచ్చరించారు. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్​, సుల్తాన్​ బజార్​ మెటర్నిటీ దవాఖాన్లలో మందులన్నీ అందుబాటులో ఉండవని పదే పదే ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు పెంచినా ఇబ్బందులెందుకు వస్తున్నాయని ఆఫీసర్లను ప్రశ్నించారు. కొన్ని ఆసుపత్రుల్లో కనీసం విటమిన్​, బీపీ, షుగర్​ ట్యాబ్లెట్లు లేకపోవడంపై మండిపడ్డారు. ఈ లోపాన్ని గుర్తించేందుకు ప్రతీ టీచింగ్​ ఆసుపత్రికి ఒక సీనియర్​ డాక్టర్​ తో కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. మందుల కొరత రావడానికి ప్రధాన కారణాలను ఆ టీమ్​ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక పంపనున్నది. టీఎస్​ఎంఎస్​ఐడీసీ నుంచి సకాలంలో సప్లై లేదా? ఆసుపత్రులు టైంకు ఇండెంట్​ పెట్టలేకపోయారా? వంటివన్నీ పరిశీలించనున్నారు. మరోవైపు జ్వరం గోలీ నుంచి కాస్ట్​ లీ మందుల వరకు అన్నీంటిని సర్కార్​ దవాఖాన్లలో ప్రీగా ఇవ్వాలని ప్రభుత్వం బడ్జెట్​ కేటాయిస్తుంటే , కొన్ని మందులు ఎందుకు ఇవ్వాల్సి వస్తుందనే దానిపై కూడా మంత్రి ఆరా తీశారు. మందులు కొరత అనే ముచ్చటే తనకు వినిపించకూడదని రెండు రోజుల క్రితం సూపరింటెండెంట్లతో జరిగిన టెలీ కాన్ఫరెన్స్​ లో మంత్రి హరీష్​రావు నొక్కి చెప్పినట్లు సమాచారం.

Tags:    

Similar News