విద్యార్థులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండ్రోజులు సెలవులు

మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం సోమవారం స్కూళ్లకు సెలవు ప్రకటించింది. రేపు ఆదివారం, సోమవారం సెలవు కావడంతో విద్యార్థులకు వరుసగా రెండ్రోజులు సెలవులు లభించాయి.

Update: 2024-09-14 15:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: మిలాద్ ఉన్ నబీ(milad un nabi) పండుగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం(AP Govt) సోమవారం స్కూళ్లకు సెలవు ప్రకటించింది. రేపు ఆదివారం, సోమవారం సెలవు కావడంతో విద్యార్థులకు వరుసగా రెండ్రోజులు సెలవులు లభించాయి. మళ్లీ తిరిగి మంగళవారం పాఠశాలలు తెరుచుకోనున్నాయి. మరోవైపు తెలంగాణలో మిలాద్ ఉన్ నబీ పండుగ సెలవును మంగళవారం ఇచ్చింది. అదే రోజున హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం జరునుగంది. కాగా, మహ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని మిలాద్ ఉన్ నబీ అని అంటారు. ఈ పర్వదినం రోజున ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. ఇస్లాం క్యాలెండర్‌లోని మూడో నెల 12వ రోజు ఈ పర్వదినం వస్తుంది. భారతదేశంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఉరుసు ఉత్సవాలను నిర్వహిస్తారు. అలాగే పేద ప్రజలకు ధనాన్ని పిండి వంటలను పంచి పెడతారు. అదే రోజు ప్రత్యేకంగా ఖురాన్ పఠిస్తారు.


Similar News