జొన్న రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
తెలంగాణలో జొన్న కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణలో జొన్న కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతుల నుంచి కనీస మద్దతు ధరకు జొన్నలు కొనుగోలు చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఆదిలాబాద్, నిజామాబాద్ రైతుల విజ్ఞప్తి మేరకు జొన్న కొనుగోలుకు రెడీ అయిన ప్రభుత్వం మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించింది. జొన్న రైతులెవరూ తక్కువ ధరకు అమ్ముకోవద్దని మంత్రి తుమ్మల సూచించారు. మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు.
Read More..
రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్.. వచ్చేవారం ఖాతాలోకి నగదు జమ..