పింఛన్‌దారులకు శుభవార్త.. రూ.4 వేలు పంపిణీ అప్పటి నుంచే

ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు పక్కాగా ముందుకెళ్తోంది.

Update: 2024-01-22 15:53 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు పక్కాగా ముందుకెళ్తోంది. ఆరు గ్యారంటీల్లో భాగంగా.. మొదటి గ్యారెంటీగా ఇప్పటికే మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కప్పించారు. ఇక రెండో గ్యారంటీగా చేయూత పథకంలో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ లిమిట్‌ను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు వరకు పెంచారు. ఇక కొత్త రేషన్ కార్డులు, గృహ జ్యోతి, మహాలక్ష్మి, రైతు భరోసా కింద ప్రజలు లబ్ధి పొందేందుకు గాను ‘ప్రజా పాలన’ పేరుతో ఆయా గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించారు.

ఈ క్రమంలోనే ఇప్పటికే పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారులు పెన్షన్ పెంపు విషయంలో ప్రభుత్వ ప్రకటన కోసం వేయి కన్నులతో ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వయసు ప్రామాణికంగా చేసుకుని ఇచ్చే పింఛను రూ.2,016, దివ్యాంగ పింఛను రూ.3,016 ఉంది. కానీ, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తాము అధికారంలకి వస్తే.. వయసు ప్రామాణికంగా చేసుకుని ఇచ్చే పింఛను రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్‌ను రూ.6వేల చేస్తామని ప్రకటించింది. అయితే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తమకు కొత్త పెన్షన్ ఎన్నడో ఇస్తదోనని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. అయితే, ఇదే నెల నుంచి ప్రభుత్వం తమకు పెన్షన్ పెంచుతుందని ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక పింఛన్‌దారుల విషయానికి వస్తే.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 15,98,729 మంది వృద్ధాప్య పింఛన్లు, 15,60,707 మంది వితంతువులు, 5,03,613 దివ్యాంగ పింఛన్లు 4,24,585 బీడీ కార్మిక పిఛన్లు, 1,42,394 ఒంటరి మహిళ పింఛన్లు, 65,307 గీత కార్మికుల పింఛన్లు, 37,145 చేనేత కార్మికుల పింఛన్లు, 35,998 హెచ్‌ఐవీ బాధితులు పింఛన్లు ఉన్నాయి. ఇలా మొత్తం 43,96,667 మంది పింఛన్లు తీసుకుంటుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థతి చూస్తుంటే ఈ నెల మాత్రం పాత పద్ధతిలోనే పెన్షన్లు ఇచ్చే ఛాన్స్ కనబడుతోంది. కొత్త పింఛన్ల విషయంలో విధివిధానాలు ఖరారు చేయకపోవడం వల్ల ఈ నెల కూడా పాత పెన్షన్లే ఇవ్వనున్నట్లు తెలిసింది.  

Tags:    

Similar News