విద్యార్థులకు భారీ శుభవార్త.. ఏడాదికి ఎన్ని వీక్లీ ఆఫ్‌లంటే?
మెడికల్ స్టూడెంట్స్ కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని నేషనల్ మెడికల్ కమిషన్ వీరికి ప్రతి ఏటా కనీసం 20 వీక్లీ ఆఫ్‌లు తీసుకోవచ్చని ప్రకటించింది.
దిశ, ఫీచర్స్: మెడికల్ స్టూడెంట్స్ కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని నేషనల్ మెడికల్ కమిషన్ వీరికి ప్రతి ఏటా కనీసం 20 వీక్లీ ఆఫ్‌లు తీసుకోవచ్చని ప్రకటించింది. అలాగే వీరికి ప్రతి సంవత్సరం 5 డేస్ విద్యా సెలవు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ నిర్ణయం తీసుకున్న ఎన్‌ఎంసీ ఈ ఉత్తర్వుకు నోటిఫికేషన్ జారీ చేసి.. అన్ని వైద్య కళాశాలలకు, యూనివర్సిటీలకు పంపారు. అంతేకాకుండా ఎన్ఎంసీ కొత్త నిబంధనలకు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల కోర్సు టైంలో జిల్లా హాస్పిటల్‌లో 3 నెలలు గడపవలసి ఉంటుందని జాతీయ వైద్య కమిషన్ సమావేశంలో ఎన్ఎంసీ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు డాక్టర్ విజయ్ ఓజా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా 80 శాతం హాజరు ఉంటేనే స్టూడెంట్స్ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులకు తప్పకుండా సరిపడా హాస్టల్ సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. కానీ స్టూడెంట్స్ మాత్రం తప్పనిసరి హాస్టల్‌లో ఉండాలనే నిబంధన విధించలేదు.