కనువిందు చేయనున్న గోల్కొండ కోట.. సరికొత్త హంగులతో ముస్తాబు

అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా కేంద్ర ప్రభుత్వం చారిత్రక ప్రదేశాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇటీవలే నిధులు విడుదల చేసింది.

Update: 2024-01-24 12:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా కేంద్ర ప్రభుత్వం చారిత్రక ప్రదేశాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇటీవలే నిధులు విడుదల చేసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ కి షాన్ గోల్కొండ కోట చరిత్రను కళ్లకు కట్టేలా సౌండ్, లైటింగ్ సిస్టమ్‌ ఏర్పాటు చేయించారు. అయితే, 30 ఏళ్ల క్రితమే కోటలో సౌండ్, లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసినా.. అవి మరుగున పడిపోయాయి. దీంతో కేంద్రం స్పందించి పలు అభివృద్ధి పనులకు ఆదేశాలు జారీ చేసింది. హై ఎండ్ లైటింగ్ సిస్టమ్‌తో పాటు సౌండ్ ఏర్పాటు చేశారు. వీకెండ్‌ గోల్కొండ కోటను వీక్షించేందుకు వచ్చే పర్యాటకులకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో గోల్కొండ చరిత్రను స్క్రీన్‌పై వేసి ప్రదర్శించనున్నారు. అయితే ఈ షో 30 నిమిషాల 2 సెకండ్ల పాటు కొనసాగనుంది.

Tags:    

Similar News