పెరుగుతున్న గోదావరి ఉధృతి.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రధాన చెరువులు, కుంటలు, డ్యామ్‌లు పూర్తి స్థాయిలో నిండాయి.

Update: 2024-09-04 08:12 GMT

దిశ, భద్రాచలం: తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి(Godavari River) పరివాహక ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రధాన చెరువులు, కుంటలు, డ్యామ్‌లు పూర్తి స్థాయిలో నిండాయి. దీంతో అధికారులు డ్యామ్ ల గేట్లను ఎత్తి గోదావరి నదిలోకి వరద నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో భద్రాచలం(badrachalam) వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. మంగళవారం రాత్రి 9 గంటలకు 40.50 అడుగులు ఉన్న గోదావరి, బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు 43.1 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి వరద శ్రీరామ్ సాగర్(sriramsagar) వద్ద పెరుగుతుండటంతో భద్రాద్రి వద్ద మరికొన్ని అడుగులు పెరిగి సాయంత్రం నుండి నిలకడగా ప్రవహించే అవకాశం ఉంది. చింతూరు, కుంట దగ్గర శబరి నది పోటు కారణంగా గోదావరి దిగువకు నెమ్మదిగా తరలివెళ్తుంది. కాగా తాలిపేరు ప్రాజెక్ట్‌ (Taliperu project)కు వరద తగ్గింది. బుధవారం ప్రాజెక్ట్ 6 గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి 5,828 క్యూసెక్కుల నీటిని దిగువనున్న గోదావరిలోకి వదిలారు. కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి ఉదయం 11.45 గంటలకు 8 గేట్లు ఎత్తి 53 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.


Similar News