పోటీ పరీక్షలకు ఉచితంగా మెటీరియల్ ఇవ్వండి : గ్రంథాలయ సంస్థ చైర్మన్ కు వినతి

ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు దినపత్రికలు, పోటీ పరీక్ష పత్రికలకు మోటీరియల్ ఉచితంగా పంపిణీ చేయాలని, అందుకు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ సహకరించాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్-475 నాయకులు డిమాండ్ చేశారు.

Update: 2024-08-05 16:41 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు దినపత్రికలు, పోటీ పరీక్ష పత్రికలకు మోటీరియల్ ఉచితంగా పంపిణీ చేయాలని, అందుకు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ సహకరించాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్-475 నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ కు సోమవారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కొప్పిశెట్టి సురేశ్ వినతి అందజేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ తరఫున ఉచితంగా అందించాలని ఆయన కోరారు. రియాజ్ ఆధ్వర్యంలో గ్రంథాలయాల అభివృద్ధి మరింత జరగాలని వారు కోరారు. విద్యార్థుల భవిష్యత్ కు సంబంధించిన అంశమని, వీలైనంత త్వరగా మెటీరియల్ అందించాలని వారు పేర్కొన్నారు.


Similar News