GHMC కమిషనర్ ఆమ్రపాలి దూకుడు.. షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లకు ఝలక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆమ్రపాలి నగరంలో నిబంధనలు పాటించని మాల్స్, మల్టీప్లెక్స్‌లకు నోటీసులు జారీ చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆమ్రపాలి నగరంలో నిబంధనలు పాటించని మాల్స్, మల్టీప్లెక్స్‌లకు నోటీసులు జారీ చేశారు. సిటీలో పలు మాల్స్, సినిమా థియేటర్లు నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నాయని, అలా చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీనుకుంటామని హెచ్చరించారు. ప్రజల నుండి ఎక్కువ పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కమిషనర్ తెలిపారు.
అలాగే... కొంత మంది థియేటర్ యజమానులు తమ థియేటర్లని సింగల్ స్క్రీన్ల కింద నమోదు చేసుకొని, మల్టీపుల్ స్క్రీన్లు నడిపిస్తున్నట్లు బయటపడిందన్నారు. దీంతో GHMC అధికారులు నగరంలో పలు ఏరియాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో నిబంధనలు పాటించని వాటిని గుర్తించి నోటీసులు జారీ చేశామని ఆమె వెల్లడించారు.