హైదరాబాద్‌లో ఈ ఒక్కరోజే లక్ష గణేశ్ విగ్రహాల నిమజ్జనం

హైదరాబా‌లో రికార్డు స్థాయిలో గణేశ్ నిమజ్జనాలు జరుగుతున్నాయి..

Update: 2024-09-17 04:19 GMT

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌ (Hyderabad)లో రికార్డు స్థాయిలో గణేశ్ నిమజ్జనాలు (Ganesha Immersions) జరుగుతున్నాయి. 11 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గణనాధులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. ఇప్పటి వరకూ 40 వేల విగ్రహాలు నిమజ్జనం జరిగాయి. ఈ ఒక్క రోజు లక్ష గణపతులు నిమజ్జనం కానున్నారు. వివిధ చెరువులు, కుంటలు, కాలువలు, సరస్సులలో నిమజ్జనమవుతున్నారు. వినాయక చవితి (Vinayaka Chavithi) నుంచి పూజలు అందుకున్న గణనాథులను ఈ రోజు తెల్లవారుజాము నుంచే హుస్సేన్ సాగర్‌ (Hussain Sagar)‌కు తరలిస్తున్నారు. దీంతో నగర వాసులు బైబై గణేశ్ (Bye Bye Ganesh) అంటూ ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. ఇప్పటికే సాగర్‌లో30 వేల విగ్రహాలకు నిమజ్జనం పూర్తి అయింది. 

కాగా ఖైరతాబాద్ మహాగణపతి (Khairatabad Maha Ganapathi) మరికాసేపట్లో ట్యాంక్ బండ్ (Tank Bund) వైపు శోభాయాత్రగా కదలనున్నారు. ఇందుకోసం భారీ భద్రత ఏర్పాటు చేశారు. శోభాయాత్ర జరగనున్న రహదారిలోనూ పోలీసులు భారీగా మోహరించారు. మధ్యహ్నం తర్వాత ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్‌లో మహాగణపతి గంగమ్మ ఒడికి చేరుకోనున్నారు. 


Similar News