వినాయకచవితి స్పెషల్.. ఆకట్టుకుంటున్న KCR ఎర్రవెల్లి ఫామ్‌హౌ‌జ్‌లోని విగ్రహం

దేశ వ్యాప్తంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కొన్ని చోట్ల ఇప్పటికే విగ్రహాలు ప్రతిష్టించి.. పూజలు షురూ చేయగా.. మరికొన్ని చోట్ల ప్రతిష్టాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Update: 2024-09-07 03:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కొన్ని చోట్ల ఇప్పటికే విగ్రహాలు ప్రతిష్టించి.. పూజలు షురూ చేయగా.. మరికొన్ని చోట్ల ప్రతిష్టాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి గల్లీలో మండపాలతో సందడి వాతావరణం నెలకొంది. లైటింగ్స్, మైకులతో కాలనీలు అన్నీ మోత మోగిపోతున్నాయి. ఇదిలా ఉండగా.. తెలుగు ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గణేశ్ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు చెప్పారు.

ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పోస్టు పెట్టారు. అయితే, ఈ పోస్టులో కేసీఆర్‌ ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లోని ఆయన డెస్క్‌లో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఫొటో తీసి పెట్టారు. మొత్తం బంగారు ఆభరణాలతో ఉన్న ఈ విగ్రహం మెరిపోతుంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా.. గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిద్దామని రాష్ట్ర పోలీస్ శాఖ నిర్వహకులకు సూచించింది. నవరాత్రి ఉత్సవాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

 


Similar News