దయనీయంగా వరంగల్ ఎంజీఎం పరిస్థితి.. మార్చురీలో ఫ్రీజర్లు పనిచేయక కుళ్లిపోతున్న మృతదేహాలు

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి మరోసారి హాట్‌టాపిక్‌‌గా మారింది. ఆసుపత్రిలోని మార్చురీలో డెడ్‌బాడీలను పెట్టే ఫ్రీజర్లు పనిచేయట్లేదని సమాచారం.

Update: 2024-04-27 04:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి మరోసారి హాట్‌టాపిక్‌‌గా మారింది. ఆసుపత్రిలోని మార్చురీలో డెడ్‌బాడీలను పెట్టే ఫ్రీజర్లు పనిచేయట్లేదని సమాచారం. ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో డెడ్‌బాడీలన్నీ కుళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. జనావాసాల మధ్య మార్చురీ ఉండటంతో పరిసరాల్లో దుర్వాసన రావడంతో స్థానికులు, ఆసుపత్రికి వచ్చే రోజులు, రోగుల బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫ్రీజర్లలో ఉండే మృతదేహాలను త్వరగా కాల్చివేయాలని, లేదంటే ఫ్రీజర్లను బాగు చేయించాలని కోరుతున్నారు.

అయితే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంజీఎమ్ ఆసుపత్రే అతి పెద్దది. ఎక్కడ ఏం జరిగినా హుటాహుటిన ఇదే ఆసుపత్రికి తరలిస్తున్నారు. దీంతో నిత్యం ఈ ఆసుపత్రికి రోగుల తాకిడి భారీ స్థాయిలో ఉంటుంది. అలాంటి ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంతో రోజూ రోగులు, రోగుల బంధువులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. మార్చురీలో ఫ్రీజర్లు పనిచేస్తున్నాయో లేదో కూడా చూడటం లేదని మండిపడుతున్నారు. శవాలు కుళ్లిపోయి వాసన వస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ల

Tags:    

Similar News