Free Parking: మెట్రో స్టేషన్ వద్ద ఫ్రీ పార్కింగ్ తొలగింపు.. ప్రయాణికుల ఆందోళన

హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం ప్రయాణికులకు బిగ్ షాకిచ్చింది.

Update: 2024-08-14 08:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం ప్రయాణికులకు బిగ్ షాకిచ్చింది. నాగోల్ మెట్రో స్టేషన్‌లో నిన్నటి వరకు ఉచితంగా ఉన్న పార్కింగ్‌‌ను తొలగించి.. గంటకు ఓ రేటు చొప్పున రేటు ఫిక్స్ చేసిన యాజమాన్యం పెయిడ్ పార్కింగ్ బోర్డును తగిలించింది. ఇది చూసిన ప్రయాణికులు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే మెట్రో చార్జీలు తలకుమించిన పరిణమించాయని, మళ్లీ పార్కింగ్ పేరుతో కొత్తగా దోపడీ మొదలు పెట్టారంటూ ప్రయాణికులు ఫైర్ అవుతున్నారు. ఈ విషయంపై హెచ్ఎంఆర్ వెంటనే స్పందించి ఫ్రీ పార్కింగ్‌ను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో.. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ప్రయాణికులు హెచ్చరిస్తున్నారు. అయితే, పెయిడ్ పార్కింగ్‌లో బైక్ పార్క్ చేయాలంటే 2 గంటలకు రూ.10, 8 గంటలకు రూ.25, 12 గంటలకు రూ.40 చెల్లించాలంటూ హెచ్ఎంఆర్ రేట్లు ఫిక్స్ చేసింది.   

Tags:    

Similar News