గుడ్ న్యూస్.. నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ!
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి శిక్షణ కల్పించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ సైదులు ఓ ప్రకటనలో తెలిపారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి శిక్షణ కల్పించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ సైదులు ఓ ప్రకటనలో తెలిపారు. జనరల్ డ్యూటీ అసిస్టెంట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులు, డయాలసిస్ టెక్నీషియన్ 3, 4 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, మిర్యాలగూడ, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్లో శిక్షణ కేంద్రాలు ఉన్నాయని వివరించారు.
శిక్షణ సమయంలో అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయం ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. 18నుంచి 35 ఏళ్ళ వయస్సున్న, పదో తరగతి చదివిన నిరుద్యోగ అభ్యర్థులు అర్హులని వెల్లడించారు. ఆసక్తి ఉన్న ఎస్సీ యువత ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 98485 81100, 90599 02355 నెంబర్లకు సంప్రదించాలని, ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ యువత సూచించారు.