బ్రేకింగ్: తెలంగాణలో బయటపడ్డ మరో స్మార్ట్ కాపీయింగ్ వ్యవహారం
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు రాష్ట్రంలో సంచలనం రేపుతోన్న సంగతి తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు రాష్ట్రంలో సంచలనం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సిట్ దర్యాప్తులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. కొందరు అభ్యర్థులు ఎలక్ట్రానిక్ డివైజ్‌ల ద్వారా పరీక్ష రాసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అయితే, ఓ పక్క ఈ కేసుకు సంబంధించిన సిట్ దర్యాప్తు సీరియస్‌గా కొనసాగుంతడగానే.. రాష్ట్రంలో మరో స్మార్ట్ కాపీయింగ్ వ్యవహరం వెలుగులోకి వచ్చింది. ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం ఇటీవల నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో నలుగురు విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడి అడ్డంగా బుక్ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కాగా, పరీక్షకు ముందుగానే సమాధానాల కోసం వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్న నలుగురు విద్యార్థులు.. ఎగ్జామ్ సెంటర్‌లోకి మొబైల్ ఫోన్లను తీసుకెళ్లారు. ఈ నలుగురికి నాలుగు చోట్ల సెంటర్లు పడగా.. సికింద్రాబాద్‌లోని ఎస్‌వీఐటీ పరీక్ష కేంద్రంలో ఎగ్జామ్ రాసిన ఓ విద్యార్థి తాను రాసిన ఆన్సర్లను వాట్సప్ గ్రూప్‌లో స్నేహితులకు పంపాడు. సికింద్రాబాద్, మల్లాపూర్, మౌలాలీ, ఎల్బీనగర్ పరీక్ష కేంద్రాల్లో ఈ నలుగురు విద్యార్థులు పరీక్ష రాసినట్లు సమాచారం. అయితే, ఇందులో ఓ విద్యార్థిని ఎగ్జామ్ అబ్జర్వేటర్ పట్టుకోవడంతో ఈ కాపీయింగ్ వ్యవహారం బయటపడింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.