తెలంగాణ సమాచార కమిషన్ కు సభ్యులను నియమించండి.. ఫోరం ఫర్ గుడ్ గరవర్నెన్స్

Update: 2023-03-29 10:07 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సమాచార కమిషన్ కార్యాకలాపాలు స్థంభించిపోయాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి ఆరోపించారు. తక్షణమే కమిషన్ కు కమిషనర్లను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పద్మనాభరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ కమిషన్ కు సంబంధించిన కమిషనర్లందరూ పదవీ విరమణ చేయడంతో కార్యకలాపాలు ఆగిపోయాయని అన్నారు. కమిషన్ లో ఇప్పటికే 9,222 అప్పీల్స్ పెండింగ్ లో ఉండగా.. నెలకి 650 అప్పీళ్ల వరకు వస్తున్నాయని తెలిపారు. కమిషన్ పని చేయకపోవడంతో పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించి అవినీతికి ఆస్కారం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కమిషనర్లను త్వరగా నియమించాలని డిమాండ్ చేశారు.

కాగా 2005లో వచ్చిన సమాచార హక్కు చట్టం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం 2017లో తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ ను ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్, అప్పటి ప్రతిపక్ష నేత జానారెడ్డి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీలతో కూడిన త్రిసభ్య కమిటీ.. ప్రధాన కమిషనర్ గా డాక్టర్ ఎస్. రాజా సదారం, కమిషర్ గా బుద్ధా మురళిలను ఎంపిక చేసింది. అనంతరం 2020 ఫిబ్రవరిలో సీనియర్ జర్నలిస్ట్ కట్టా శేఖర్ రెడ్డి, మైదా నారాయణరెడ్డి, గుగులోతు శంకర్ నాయక్, సయ్యద్ ఖలీలుల్లా, మహ్మద్ అమీర్ హుస్సేన్ కమిషనర్లుగా ప్రభుత్వం నియమించింది. అయితే మూడేళ్ల గడువు ముగియంతో వాళ్లంతా పదవి విరమణ చేశారు. ప్రస్తుతం కమిషన్ కు సభ్యులెవరు లేరని, త్వరగా నియమించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెర్స్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

Tags:    

Similar News