మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ఇవ్వాలి: మాజీ మంత్రి KTR డిమాండ్
భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావుకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావుకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. పీవీని విస్మరించి కాంగ్రెస్ చేసిన అన్యాయం ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దాలని.. కేంద్రాన్ని కోరుతున్నానని అన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే డిమాండ్ చేశామో.. ఇప్పుడు కూడా అదే అడుగుతున్నామన్నారు. పీవీ నర్సింహరావుకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. శనివారం పీవీ నరసింహా రావు 19వ వర్ధంతి సందర్భంగా కేటీఆర్ నివాళులర్పించారు. ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌తో కలిసి అప్పుల్లో కూరుకుపోయిన భారతదేశాన్ని గాడిన పెట్టీ పీవీ తన వంతు దేశానికి సేవలు అందించారని గుర్తు చేశారు. తెలుగు వారికి, తెలంగాణ వారికి, భారతదేశానికి వన్నె తెచ్చిన నేత పీవీ నర్సింహ రావు అని కొనియాడారు. ఆయన ఆదర్శాలకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. ఢిల్లీలో పీవీ ఘాట్ నిర్మించాలని డిమాండ్ చేశారు.