బ్రేకింగ్: బీజేపీకి రాజీనామా చేయడంపై మాజీ MP వివేక్ క్లారిటీ

తెలంగాణ రాజకీయాల్లో రాజీనామాల ట్రెండ్ నడుస్తోంది. టికెట్ దక్కని ఆశావహులు, స్థానిక లీడర్లపై అసంతృప్తితో సెకండ్ కేడర్ రాజీనామాల బాట పడుతున్నారు.

Update: 2023-10-25 07:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో రాజీనామాల ట్రెండ్ నడుస్తోంది. టికెట్ దక్కని ఆశావహులు, స్థానిక లీడర్లపై అసంతృప్తితో సెకండ్ కేడర్ రాజీనామాల బాట పడుతున్నారు. రోజుల వ్యవధిలోనే వివిధ పార్టీల కండువాలు మార్చుతున్నారు. ఇదిలా ఉండగా.. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేయడం స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కోమటిరెడ్డి రాజీనామా నేపథ్యంలో తెలంగాణ బీజేపీకి చెందిన మరో కీలక నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి సైతం కాషాయ పార్టీకి గుడ్ బై చెబుతారని జోరుగా ప్రచారం జరిగింది.

వివేక్ కూడా బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని పెద్ద ఎత్తున గత కొన్ని రోజులుగా పొలిటికల్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీకి రాజీనామా చేయడంపై మాజీ ఎంపీ వివేక్ స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చారు. నేను పార్టీ మారుతున్నట్లు కొంతకాలంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తాను బీజేపీకి రాజీనామా చేసేది లేదని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరుఫున పెద్దపల్లి లోక్ సభ స్థానానికి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా విషయం తనకు తెలియదని అన్నారు.

Tags:    

Similar News