'టెన్త్ ఫెయిలైన తెలంగాణ విద్యాశాఖ మంత్రి'
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌పై సబితా ఇంద్రారెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌పై సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 'అమ్మా నిర్మలా సీతారామన్ గారు.. తెలంగాణ ప్రభుత్వంలో ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు. నేను, నా సహోద్యోగి సత్యవతి రాతోడ్. గత మూడేళ్లుగా కేసీఆర్ గారి చైతన్యవంతమైన నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తున్నారు. ఈ విషయం మీకు తెలియకపోవడం దురదృష్టకరం' అంటూ సబితా తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా.. సబిత వ్యాఖ్యలపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఘటుగా రియాక్ట్ అయ్యారు. 'ఆమె నిజంగా చదువుకోలేదు. ఆమె 10వ తరగతి ఫెయిల్ అయిన తెలంగాణ విద్యాశాఖ మంత్రి. ఆమెకు ట్విట్టర్‌ని ఎలా వాడాలో, ఇంగ్లీషులో ఎలా టైప్ చేయాలో తెలియదు. ఆమె ట్వీట్లను 'తెలంగాణ క్రౌన్ ప్రిన్స్ ఇన్ వెయిటింగ్ ట్విటర్ ఆర్మీ' టైప్ చేసింది. దయచేసి ఆమెను క్షమించండి అంటూ సెటైర్లు వేశారు. కాగా, ఇటీవల కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన ఫాంహౌస్‌లో నల్లపిల్లితో క్షుద్రపూజలు చేస్తున్నారని వ్యాఖ్యానించగా నిర్మలా సీతారామన్ కూడా మీడియాతో మాట్లాడుతూ..ఆయన తాంత్రికుడి సలహాల మేరకు కేసీఆర్ పని చేస్తారని అన్నారు.
She not really educated.
— Konda Vishweshwar Reddy (@KVishReddy) October 9, 2022
She is 10th standard failed Education minister of Telangana.
She does not know how to type in English, leave alone use Twitter.
Her tweets are typed by Telangana Crown Prince-in-waiting's Twitter Army
Please excuse her.@trspartyonline@BJP4Telangana https://t.co/53IsguaHWz pic.twitter.com/G6LiA6Z2Tx