ఖర్చు, టైం కలిసొస్తుంది.. ప్రభుత్వానికి మాజీ ఎంపీ బూర సూచన
స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగిస్తున్నట్లు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
దిశ, తెలంగాణ బ్యూరో: స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగిస్తున్నట్లు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఇప్పటికే ‘స్వామి రామానంద తీర్థ రూరల్ ఇనిస్టిట్యూట్’ పోచంపల్లి మండలం జలాల్పురం గ్రామంలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఉందని ఆయన తెలిపారు. ఈ స్కిల్ యూనివర్సిటీని ఇందులోనే స్థాపిస్తే అటు ఖర్చు తగ్గటమే కాకుండా సమయం కూడా కలిసొస్తుందని ఆయన సూచించారు.