తెలంగాణ సచివాలయం, అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేస్తారా?

కాంగ్రెస్ ప్రభుత్వంపై నల్లగొండ బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కర్నె ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు.

Update: 2024-02-29 11:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై నల్లగొండ బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కర్నె ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను నిర్వీర్యం చేయాలన్న ఆలోచనతో ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కుట్రను, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న భావనతోనే మేడిగడ్డ వెళ్తున్నామని చెప్పారు. తెలంగాణను ఎండబెట్టాలన్న ఆలోచనతో ప్రభుత్వం కనిపిస్తోందని మండిపడ్డారు. అవినీతి జరిగిందని పదేపదే మాట్లాడుతున్నారు.. జరిగిన ప్రతి పనిలోనూ అవినీతి అని చెప్పి రాష్ట్రాన్ని అధోగతి పాలుజేయాలని చూస్తున్నారని విమర్శించారు.

అతిపెద్ద అవినీతి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా చెబుతారు? ఆయన విచారణ అధికారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని అంటున్నారు.. సచివాలయం, అంబేడ్కర్ విగ్రహం, అమరుల స్థూపం లేకుండా చేస్తారా? అని అడిగారు. సీఎం రేవంత్ రెడ్డే కాదు.. మంత్రులు కూడా తలా తోక లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వాలని కోరుతున్నామని స్పస్టం స్పష్టం చేశారు. మేడిగడ్డ కూలిపోయేలా చేసే కుట్రకు ప్రభుత్వం మాట్లాడుతోందని అన్నారు. కాంగ్రెస్ అభివృద్ధి యాత్రలు చేయాలి కానీ.. మాకు పోటీ యాత్రలు కాదని హితవు పలికారు. రైతులను ఆదుకోవాలని కోరుతుంటే అధికారంలో ఉండి పోటీ యాత్రలు చేస్తే ఎలా? అని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల డొల్లతనం అర్థం అవుతోందని అన్నారు.

Tags:    

Similar News