బాంబు పేల్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీజేపీని వీడటంపై క్లారిటీ!
ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గరు జైలుకెళ్లడం ఖాయమని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఒక నెలలోనే జరుగుతుందని ఆయన బాంబు పేల్చారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గరు జైలుకెళ్లడం ఖాయమని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఒక నెలలోనే జరుగుతుందని ఆయన బాంబు పేల్చారు. చంపాపేటలో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. రేవంత్ రెడ్డిని కొత్త బిచ్చగాడిగా అభివర్ణించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు వలసవాది అని, ఆయన తమలాంటి వాళ్ళను కాంగ్రెస్ లోకి ఆహ్వానించడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తామన్నా చేర్చుకోవడం కష్టమేనని అన్నారు. ఎందుకంటే ఆయనపై ఉన్న కేసులను చెక్ చేయాల్సి ఉంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. క్లీన్ ఇమేజ్ ఉన్నవాళ్ళను మాత్రమే బీజేపీ చేర్చుకుంటుందన్నారు. తామంతా ఒక లక్ష్యం కోసం బీజేపీలో చేరినట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టంచేశారు. తాను బీజేపీని వీడే ప్రస్తక్తే లేదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. బీజేపీలో కొత్తగా చేరిన వారికి కూడా అవకాశాలిస్తే.. పార్టీ మరింత బలోపేతమవుతుందన్న అభిప్రాయాన్ని పెద్దలకు వివరించినట్లు చెప్పారు. అవినీతిపరులపై కఠినంగా వ్యవహరించాలని, ఆధారాలు కావాలంటే తామిస్తామని ఢిల్లీ పెద్దలకు చెప్పామన్నారు. బలమైన నేతలను బీజేపీ నాయకత్వం ఉపయోగించుకోవాలనేదే తన అభిప్రాయమని పేర్కొన్నారు.
Also Read..