కేసీఆర్ ఆ పని చేయడంలో ఎక్స్‌పర్ట్.. అదిరిపోయే సెటైర్ వేసిన జగ్గారెడ్డి
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సెటైర్ వేశారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సెటైర్ వేశారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పిట్టల కథలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టింది ప్రజల బడ్జెట్, అభివృద్ధి బడ్జెట్ అని అభివర్ణించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ డైరెక్షన్‌లోనే సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నాడని స్పష్టం చేశారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి రూ.10 వేల కోట్లు కేటాయించారని.. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ హైదరాబాద్‌కు ఎందుకు నిధులు కేటాయించలేదని ప్రశ్నించారు.
రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసిన కాంగ్రెస్ బడ్జెట్‌ను స్వాగతించాల్సి పోయింది విమర్శలు చేస్తు్న్నారని కేసీఆర్‌పై మండిపడ్డారు. బడ్జెట్‌ను కేసీఆర్ స్వాగతిస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గానూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2,91,059 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్ర బడ్జెట్‌పై కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి ఒక పాలసీ లేదు, విధానం లేదంటూ నిప్పులు చెరిగారు. ఈ క్రమంలోనే కేసీఆర్ వ్యాఖ్యలకు పై విధంగా జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు.