సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఫైర్

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే కేఆర్ఎంబీకి తెలంగాణలోని ప్రాజెక్టులను అప్పగించడం అన్యాయమని మాజీ మంత్రి పొన్నల లక్ష్మయ్య అన్నారు.

Update: 2024-02-05 14:48 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే కేఆర్ఎంబీకి తెలంగాణలోని ప్రాజెక్టులను అప్పగించడం అన్యాయమని మాజీ మంత్రి పొన్నల లక్ష్మయ్య అన్నారు. ట్విట్టర్ వేదికగా సోమవారం సీఎం రేవంత్‌పై మండిపడ్డారు. ప్రాజెక్టుల అప్పగింత అవమానకరం అన్నారు. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో ఎప్పుడు జరగలేదన్నారు. 2015 నుంచి 2024 వరకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య జలాలపై జరిగిన సమావేశంలోని మినిట్స్ చూడాలని కాంగ్రెస్‌కు హితవు పలికారు. ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగిస్తున్నట్లు ఎక్కడ లేదన్నారు. సేవ్ తెలంగాణ అన్నారు. రేవంత్ వ్యాఖ్యల్లో అనుభవ రాహిత్యం, అవగాహన లోపం, అహంకారం పూరిత వైఖరీ స్పష్టంగా కనబడుతుందన్నారు. విమర్శలు మానుకొని రాష్ట్ర హక్కులు కాపాడాలని ప్రభుత్వానికి హితవు పలికారు.

Tags:    

Similar News