RRR, కల్కి సినిమాల కంటే ఎక్కువగా ‘RR’ కలెక్షన్స్: కేటీఆర్ మాస్ సెటైర్

తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున పార్టీ మారుతున్నారు. అధికారం కోల్పోవడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ నుండి అధికార కాంగ్రెస్

Update: 2024-07-13 17:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున పార్టీ మారుతున్నారు. అధికారం కోల్పోవడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ నుండి అధికార కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇప్పటి వరకు 9 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు ప్లేట్ ఫిరాయించగా.. మరి కొందరు సైతం గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్. ఈ క్రమంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలో ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యే‌కు బీజేపీ రూ.50 కోట్లు ఇస్తామంటోందని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. మరీ తెలంగాణలో మా పార్టీ నుండి కాంగ్రెస్‌లో చేరుతోన్న ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంత రేట్ కడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ (పరోక్షంగా రాహుల్, రేవంత్‌ను ఉద్దేశిస్తూ) కలెక్షన్లు ఆర్ఆర్ఆర్, కల్కి సినిమాల కంటే ఎక్కువగా ఉన్నాయని ఈ సంద్భరంగా కేటీఆర్ ఎద్దేవా చేశారు. 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..