ఖమ్మంలో మాజీ మంత్రుల వాహనాలపై రాళ్ల దాడి.. ఖండించిన కేటీఆర్

ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, నామా నాగేశ్వర రావులకు అనూహ్య పరిణామం ఎదురైన విసయం తెలిసిందే.

Update: 2024-09-03 11:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, నామా నాగేశ్వర రావులకు అనూహ్య పరిణామం ఎదురైన విసయం తెలిసిందే. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వారి వాహనాలపై కొందరు అగంతకులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. తాజాగా ఈ దాడి ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ దాడిని ఖండిస్తూ సోషల్ మీడియా(ఎక్స్)లో పోస్టు పెట్టారు. ‘మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ, సబితా ఇంద్రారెడ్డి వాహనాలపై దాడి చేయటం కాంగ్రెస్ అసహనానికి నిదర్శనం.

ప్రజలకు సాయం చేయటం చేతగాక.. సాయం చేస్తున్న వాళ్లను చూసి ఓర్వలేకే ఈ దాడికి తెగబడ్డారు. మీరు ప్రజలను నిర్లక్ష్యం చేస్తే వారికి అండగా ఉండటమే తప్పా?.. ప్రజలకు సేవ చేయటం చేతకాదు.. సేవ చేసే వాళ్లపై మాత్రం దాడి చేయటమా? సిగ్గు చేటు. ఈ దాడికి ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇలాంటి ఎన్ని దాడులు చేసిన సరే.. ప్రజల వద్ద బీఆర్ఎస్ శ్రేణులను వెళ్లకుండా ఆపలేరు. కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలనను ప్రజలు గమనిస్తున్నారు. మీకు సరైన సమయంలో బుద్ధి చెప్పటం ఖాయం’ అని కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.


Similar News