రేవంత్ రెడ్డి సర్కార్‌పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్
కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రుల క్యాంటిన్లకు బిల్లులు స్టేట్
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రుల క్యాంటిన్లకు బిల్లులు స్టేట్ గవర్నమెంట్ పెండింగ్ పెట్టడంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు. ఆస్పత్రులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లలో ఆసుపత్రుల క్యాంటిన్లకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, రూ.20 కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో రోగులు, వైద్యులు అవస్థలు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న ఆసుపత్రుల క్యాంటిన్ల బిల్లులను చెల్లించాలని ఈ సందర్భంగా హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్‌ను డిమాండ్ చేశారు.