CM రేవంత్ రెడ్డి లవ్ లెటర్ రాశారు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో హరీష్ రావు చిట్‌చాట్ నిర్వహించారు.

Update: 2024-03-06 11:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో హరీష్ రావు చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా పాలనలో పెన్నులు గన్నులు అయ్యాయని విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలానే ఉండేనా? అని ప్రశ్నించారు. సచివాలయంలోని అన్ని ఫ్లోర్లలో జర్నలిస్టులు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఉండేదని తెలిపారు. నిన్నటి సభలో తనని చూసి ఓటేయాలని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు.. ఏం చూసి ఓటేయాలని అడిగారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనతో ప్రజలకు ఒరిగిందేమిటి అని అన్నారు. వైట్ పేపర్, ఆ ఆపేర్, ఈ పేపర్ అంటూ కాషాయ పేపర్ మీద ఆయన లవ్ లెటర్ రాశాడని ఎద్దేవా చేశారు.

వాస్తవానికి ప్రజలనే కాదు కాంగ్రెస్ పార్టీని కూడా రేవంత్ రెడ్డి మోసం చేశాడని అన్నారు. గతంలో గుజరాత్ మోడల్ ఫెయిల్ అని మాట్లాడిన రేవంత్ రెడ్డే.. ఇవాళ పొగుడుతున్నారని గుర్తుచేశారు. 10 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని.. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ప్రత్యర్థి పార్టీ నేతను పొగుడుతారా? అని ప్రశ్నించారు. అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారని సెటైర్ వేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను ప్రభుత్వం మభ్యపెడుతోందని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఇంతవరకు మళ్లీ ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. కనీసం మొన్న బడ్జెట్‌లో కూడా రైతు రుణమాఫీకి నిధులు కేటాయింపులు లేవని అన్నారు.

Tags:    

Similar News