కాంగ్రెస్‌లో చేరికపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్లారిటీ

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్, ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో 39

Update: 2024-06-14 06:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: గతేడాది జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్, ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలకే పరిమితమై అధికారం కోల్పోయిన గులాబీ పార్టీ.. లోక్ సభ ఎన్నికల్లోనైతే మరీ ఘోర ఓటమిని చవి చూసింది. ఏకంగా పోటీ చేసిన 17 పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ ఒక్క చోట కూడా విజయం సాధించలేదు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, బీజేపీతో పోటీ పడలేక మూడవ స్థానానికి పరిమితమైంది. ఈ ఘోర ఓటమితో పార్టీ చరిత్రలోనే ఫస్ట్ టైమ్ బీఆర్ఎస్‌ లోక్ సభలో ప్రాతినిధ్యం కోల్పోయింది. ఎన్నికల్లో వరుస ఓటములతో గులాబీ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారడంతో ఆ పార్టీ నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు పార్టీని వీడగా.. మరి కొందరు సైతం త్వరలోనే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలోనే మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారని పొలిటికల్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. కారు దిగి మాజీ మంత్రి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పార్టీ మార్పు వార్తలపై ఎర్రబెల్లి దయాకర్ రావు ఎట్టకేలకు స్పందించారు. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం లేదని.. అదంతా తప్పుడు ప్రచారమని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు జరుగుతోన్న ప్రచారాన్ని ఖండించారు. తాను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం లేదని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. కాగా, గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నుండి పోటీ చేసిన ఎర్రబెల్లి.. 26 ఏళ్ల కాంగ్రెస్ అభ్యర్థిని యశ్వసిని రెడ్డి చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. దయాకర్ రావు రాజకీయ అనుభవం అంతా వయస్సు లేని మహిళ చేతిలో మాజీ మంత్రి మంత్రి ఓటమి పాలు కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా రేపింది. 


Similar News