బ్రేకింగ్: మాజీ మంత్రి డీఎస్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం ఆరోగ్యం క్షీణించడంతో హుటాహుటీన బంజారాహిల్స్ సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారు. తన తండ్రి అస్వస్థత విషయాన్ని ఎంపీ అర్వింద్ ధృవీకరించారు. ప్రస్తుతం తన తండ్రికి చికిత్స కొనసాగుతోందని తెలిపారు. తన తండ్రి అనారోగ్యం కారణంగా అర్వింద్ ఇవాళ, రేపటి తన కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాగా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీగా పని చేసిన డీఎస్.. రాష్ట్ర విభజన అనంతరం టీఆర్ఎస్‌లో చేరి రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. ఆయన పదవీ రెన్యువల్ చేయకపోవడం, సీఎం కేసీఆర్‌తో విభేదాల కారణంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు.